🪔 లింగాష్టకం – Shiva Lingashtakam Full Lyrics

🕉 లింగాష్టకం 🔱

🕉️ శ్లోకం ౧

బ్రహ్మమురారిసురార్చిత లింగం
నిర్మలభాసితశోభిత లింగమ్ |
జన్మజదుఃఖవినాశక లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౧ ||

👉 అర్థం:
ఏ లింగమును బ్రహ్మ, విష్ణు మొదలగు సురులు అర్చించుదురో, ఏ లింగము నిర్మలత్వమను శోభతో కూడి యున్నదో, ఏ లింగము జన్మమునకు ముడిపడియున్న దుఃఖములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.


🕉️ శ్లోకం ౨

దేవమునిప్రవరార్చిత లింగం
కామదహం కరుణాకర లింగమ్ |
రావణదర్పవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౨ ||

👉 అర్థం:
ఏ లింగమును దేవతలయొక్క ఋషులయొక్క తరతరాలు అర్చించుచున్నాయో, ఏ లింగము కోరికలను కాల్చివేసి కరుణను కలిగియున్నదో, ఏ లింగము రావణాసురుని గర్వము నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.


🕉️ శ్లోకం ౩

సర్వసుగంధసులేపిత లింగం
బుద్ధివివర్ధనకారణ లింగమ్ |
సిద్ధసురాసురవందిత లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౩ ||

👉 అర్థం:
ఏ లింగము అన్నిరకముల సుగంధములచే అద్దబడియున్నదో, ఏ లింగము బుద్ధి వికాసమునకు కారణమై యున్నదో, ఏ లింగము సిద్ధులు, దేవతలు, అసురుల చే వందనము చేయబడుచున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.


🕉️ శ్లోకం ౪

కనకమహామణిభూషిత లింగం
ఫణిపతివేష్టితశోభిత లింగమ్ |
దక్షసుయజ్ఞవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౪ ||

👉 అర్థం:
ఏ లింగము బంగారము మరియు గొప్ప మణులచే అలంకరింపబడియున్నదో, ఏ లింగము సర్పరాజముచే చుట్టుకొనబడి అలంకరింపబడి యున్నదో, ఏ లింగము దక్ష యజ్ఞమును నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.


🕉️ శ్లోకం ౫

కుంకుమచందనలేపిత లింగం
పంకజహారసుశోభిత లింగమ్ |
సంచితపాపవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౫ ||

👉 అర్థం:
ఏ లింగము కుంకుమ మరియు గంధముతో అద్దబడి యున్నదో, ఏ లింగము తామరపువ్వుల హారముతో అలంకరింపబడియున్నదో, ఏ లింగము సంపాదించబడిన పాపరాశిని నాశనము చేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.


🕉️ శ్లోకం ౬

దేవగణార్చితసేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకరకోటిప్రభాకర లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౬ ||

👉 అర్థం:
ఏ లింగమును దేవగణములచే భావముతో, భక్తితో పూజింపబడుచూ సేవింపబడుచూ ఉన్నదో, ఏ లింగము కోటి సూర్య సమానమైన శోభతో ఉన్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.


🕉️ శ్లోకం ౭

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవకారణ లింగమ్ |
అష్టదరిద్రవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౭ ||

👉 అర్థం:
ఏ లింగము ఎనిమిది (బిల్వ) దళములను చుట్టూ కలిగియున్నదో, ఏ లింగము సమస్త సృష్టికి కారణమై యున్నదో, ఏ లింగము ఎనిమిది రకాల దరిద్రములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.


🕉️ శ్లోకం ౮

సురగురుసురవరపూజిత లింగం
సురవనపుష్పసదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం [ పరమపదం ]
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౮ ||

👉 అర్థం:
ఏ లింగము సురులయొక్క గురువు (బృహస్పతి) మరియు ఉత్తమమైన సురులచే పూజింపబడుచున్నదో, ఏ లింగము దేవతల పూదోటయందున్న పువ్వులచే అర్చనచేయబడుచున్నదో, ఏ లింగము ఉత్తమమైనదానికన్నా ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో యున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.


🙏 ఫలశృతి

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

👉 అర్థం:
లింగాష్టకమను ఈ పుణ్యప్రదమైన ఎనిమిది శ్లోకములను శివుని దగ్గర చదువువారు శివలోకమును పొంది శివానందమును అనుభవించెదరు.

Read more :

🔱 మహా మృత్యుంజయ మంత్రం-

🔱 Lingashtakam 🔱

🕉️ Verse 1

brahmamurārisurārcita liṅgaṁ
nirmalabhāsitaśobhita liṅgam |
janmaja-duḥkha-vināśaka liṅgaṁ
tat praṇamāmi sadā śiva liṅgam || 1 ||


🕉️ Verse 2

devamuni-pravarārcita liṅgaṁ
kāmadahaṁ karuṇākara liṅgam |
rāvaṇa-darpa-vināśana liṅgaṁ
tat praṇamāmi sadā śiva liṅgam || 2 ||


🕉️ Verse 3

sarva-sugandha-sulepita liṅgaṁ
buddhi-vivardhana-kāraṇa liṅgam |
siddha-surāsura-vandita liṅgaṁ
tat praṇamāmi sadā śiva liṅgam || 3 ||


🕉️ Verse 4

kanaka-mahāmaṇi-bhūṣita liṅgaṁ
phaṇipati-veṣṭita-śobhita liṅgam |
dakṣa-suyajña-vināśana liṅgaṁ
tat praṇamāmi sadā śiva liṅgam || 4 ||


🕉️ Verse 5

kuṅkuma-candana-lepita liṅgaṁ
paṅkaja-hāra-suśobhita liṅgam |
sañcita-pāpa-vināśana liṅgaṁ
tat praṇamāmi sadā śiva liṅgam || 5 ||


🕉️ Verse 6

deva-gaṇārcita-sevita liṅgaṁ
bhāvair-bhaktibhir eva ca liṅgam |
dinakara-koṭi-prabhākara liṅgaṁ
tat praṇamāmi sadā śiva liṅgam || 6 ||


🕉️ Verse 7

aṣṭadala-upari-veṣṭita liṅgaṁ
sarva-samudbhava-kāraṇa liṅgam |
aṣṭa-daridra-vināśana liṅgaṁ
tat praṇamāmi sadā śiva liṅgam || 7 ||


🕉️ Verse 8

suraguru-suravara-pūjita liṅgaṁ
suravana-puṣpa-sadārcita liṅgam |
parātparaṁ paramātmaka liṅgaṁ (paramapadaṁ)
tat praṇamāmi sadā śiva liṅgam || 8 ||


🙏 Phalaśruti

liṅgāṣṭakam idaṁ puṇyaṁ yaḥ paṭhet śiva-sannidhau |
śivalokam avāpnoti śivena saha modate ||

Read more :

🔱 Maha Mrityunjay
🌸
🌸
🌸
🌸
🔱
🔱
🔱
🔱
🕉
🕉
🕉

Leave a Comment